Header Banner

కాలేజీలో సీనియర్ల పైశాచికత్వం.. నగ్నంగా నిలబెట్టి.. పురుషాంగానికి డంబెల్స్ వేలాడదీసి..ర్యాగింగ్ పేరుతో దారుణం!

  Thu Feb 13, 2025 09:06        India

ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. ఏకంగా మూడు నెలలపాటు కొనసాగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ రాక్షస చర్య సర్వత్ర చర్చనీయాంశమైంది. కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. వారిని నగ్నంగా నిలబెట్టి, వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా కంపాస్‌లోని పదునైన పరికరాలను గుచ్చి గాయపర్చారు. ఇలా మూడు నెలలపాటు సాగిందీ దమనకాండ. గాయాలైన మర్మాంగాలకు బాధితులు లోషన్ పూసుకుంటే, విషయం తెలిసిన సీనియర్లు మరింతగా చెలరేగిపోయారు.

 

ఇది కూడా చదవండి: ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం! పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రమాద ఘంటికలు.. చంద్రబాబు సమీక్ష!

 

ఆ లోషన్‌ను వారి నుంచి బలవంతంగా లాక్కుని దానిని వారి నోట్లో పిండారు. అంతేకాదు, ప్రతిదానిని వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటపెడితే అకడమిక్ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరింపులకు గురిచేశారు. మద్యానికి బానిసలైన నిందితులు జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. దీంతో వారి చేష్టలు భరించలేని ఓ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి సీనియర్ల వేధింపులు గురించి చెప్పాడు. అది విన్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. దీంతో బాధితులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుడు నవంబర్ నుంచి సీనియర్లు తమను వేధిస్తున్నారని చెబుతూ తమ బాధలను ఏకరవు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు శామ్యూల్‌, జాన్సన్‌, జీవా, రాహుల్‌ రాజ్‌, రిజిల్‌ జీత్‌, వివేక్‌లపై ర్యాగింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Ragging #Kerala #MedicalCollege #CrimeNews